తంబళ్లపల్లె - అక్టోబర్ 24 : తంబళ్లపల్లి మండలంలోని కోటకొండ కు చెందిన సుమారు వందమంది వైకాపా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ గజ్జల రెడ్డప్ప ఆధ్వర్యంలో మొలకలచెరువు పార్టీ ప్రధాన కార్యాలయం లో జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కోటకొండ కు చెందిన వైకాపా నాయకులకు జనసేన పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కు అందిస్తున్న ప్రాధాన్యతను చూసి వైకాపా నాయకులు జనసేన పార్టీలో చేరడం హర్షనీయమన్నారు. అధికారం లేకపోయినా అవినీతిలో కూరుకుపోయిన వైకాపా చేస్తున్న అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులకు విసిగిపోయిన ఆ పార్టీ నాయకులు మరి కొంతమంది జనసేన పార్టీ వైపు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీలోకి వచ్చిన వైకాపా నేతలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలపై ఆకర్షితులై భవిష్యత్తులో జనసేన పార్టీ అభివృద్ధి, బలోపేతానికి ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పూజారి సురేంద్ర, మండెం రాఘవ, మండ్యం రాజశేఖర్, మండెం సుబ్రహ్మణ్యం, తోట చంద్రమోహన్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు