తంబళ్లపల్లె - అక్టోబర్ 24 : తంబళ్లపల్లె మండల స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా శనివారం ఎంపీడీవో కార్యాలయంలో పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల అధికారి శ్రీధర్ సారథ్యంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఉదయం నుండి పరిశీలనకు హాజరైన అభ్యర్థులను క్యూ పద్ధతిలో అనుమతించి పరిశీలన కార్యక్రమం ప్రశాంతంగా ఏ ఆర్ ఓ లు తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణి, అధికారులు ఒంటిగంటకు పరిశీలన పూర్తి చేశారు.అందులో పరసతోపు ఎంపీటీసీ అభ్యర్థి రెడ్డిమల్రెడ్డి, బాలిరెడ్డిగారి పల్లి ఎంపీటీసీ అభ్యర్థి కదిరప్ప, తంబళ్లపల్లె ఎంపీటీసీ అభ్యర్థి కుమారిల మూడు నామినేషన్లను పలు కారణాలతో శనివారం ఎన్నికల అధికారి శ్రీధర్ తిరస్కరించారు. ఈ పరిశీలన కార్యక్రమం లో ఎస్సై టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు భద్రత కోసం ఇనుప కంచెను ఏర్పాటు చేయగా కార్యాలయం సమీపంలో 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ తో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. తంబళ్లపల్లె ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21, 22,23 వ తేదీలలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 11 ఎంపీటీసీలకు గాను టిడిపికి చెందిన 34 మంది అభ్యర్థులు, వైకాపా నుండి 40 మంది, జనసేన పార్టీ నుండి ఆరు, బిజెపి నుండి మూడు, ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని టాస్క్ ఫోర్స్ సీఐ రాజారెడ్డి పరిశీలించి పోలీసులు ఏర్పాటుచేసిన పోలీస్ బందోబస్తు పై సంతృప్తి చెంది ఎస్సై అనిల్ కుమార్ కు పలు సలహాలు సూచనలు చేశారు

Srivani






