జగనన్న పాలన స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందిస్తా
- 3వ వార్డు వైకాపా అభ్యర్థిని రుక్సార్ సుల్తానా స్పష్టం
- ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
మదనపల్లె : జగనన్న పాలన స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందిస్తానని 3వ వార్డు వైకాపా అభ్యర్థిని రుక్సార్ సుల్తానా పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 3వ వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థిని రుక్సార్ సుల్తానా తనభర్త మహమ్మద్ హనీఫ్,పార్టీ శ్రేణులతో కలిసి ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారానికి మదనపల్లె వైకాపా ఇన్చార్జి నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బాబ్ జాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజా రెడ్డి,చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటచలపతి,యువ నాయకులు శశాంక్ రెడ్డి మద్దతుగా నిలిచారు.ఇందులో భాగంగా వార్డులోని ప్రజలను కలిసి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రుక్సార్ సుల్తాన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.తనకు కౌన్సిలరుగా ఒక అవకాశం కల్పిస్తే జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు పునరంకితమవుతానన్నారు.అదేవిధంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ,వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు,కార్యకర్తలందరికి మూడవ వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Rukmini M






