35 వార్డులో వైకాపా అభ్యర్థిని శారదారెడ్డిని గెలిపించండి 
- ప్రజలకు మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి విజ్ఞప్తి 
మదనపల్లె : మదనపల్లె పట్టణం 35 వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బుసిరెడ్డి  శారదారెడ్డిని గెలిపించాలని మదనపల్లె మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు.వార్డుపై సంపూర్ణ అవగాహన కలిగిన శారదరెడ్డి ప్రజల మనిషిగా ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారన్నారు.శనివారం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు ఓటర్లును నేరుగా కలుసుకున్నారు.గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కో-ఆప్షన్ సభ్యురాలుగా శారదా రెడ్డి చేసిన సేవలను ప్రజలకు గుర్తుచేశారు.కరోనా సమయంలోను వార్డు ప్రజలకు ఆమె చేసిన సేవలను ప్రజలంతా గుర్తు చేసుకోవాలన్నారు.శారదా రెడ్డి వార్డులో ప్రతి కుటుంబంలో సొంత సభ్యురాలుగా సేవలు అందిస్తారన్నారు.కావున కౌన్సిలర్ అభ్యర్థికి,చైర్మన్ అభ్యర్థి జింకా చలపతికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి బుసిరెడ్డి శారదా రెడ్డి మాట్లాడుతూ తనకు ప్రజలు అండగా నిలిచి ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపిస్తే వార్డు ప్రజలకు రుణపడి ఉండడంతోపాటు సమస్యల పరిష్కారానికి,సదుపాయాల కల్పనకు పునరంకితమవుతామన్నారు.