వార్డు అభివృద్ధి,ప్రజా సంక్షేమమే తన లక్ష్యం
- ఐదవ వార్డు కూటమి అభ్యర్థిని చామంచుల మల్లిక స్పష్టం
- ప్రచారానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే,ఛైర్మన్ అభ్యర్థి
మదనపల్లి : త్వరలో జరుగబోవు మునిసిపల్ ఎన్నికలలో ప్రజలు తనకు ఒక అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధి,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని ఐదో వార్డు కూటమి బలపర్చిన జనసేన అభ్యర్థిని చామంచుల మల్లికా సిద్ధు పేర్కొన్నారు.శుక్ర,శనివారాలలో వార్డు పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ ప్రచారానికి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా,ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) మద్ధతు తెలిపారు.ఈ సందర్భంగా చామంచుల మల్లిక సిద్ధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.ముఖ్యంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు.హంద్రీ-నీవా జలాలతో మదనపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు.అనంతరం శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ మదనపల్లి ప్రజలు,మేధావులు ఆలోచన చేయాలని కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి అభివృద్ధి వైపు నిలవాలన్నారు.ఒక్క ఓటు వైసీపీకి వేసినా అది వృధాగా అవుతుందన్నారు.గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో మదనపల్లి నియోజకవర్గానికి మహర్దశ సంతరించుకుందన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు ఉద్యానవన రంగం అభివృద్ధి గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కావున నవంబర్ 1న జరుగబోవు మునిసిపల్ ఎన్నికల్లో ఐదో వార్డ్ అభ్యర్థిని చామంచుల మల్లికకు గాజుగ్లాసు గుర్తుపై,మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Mani Kumar. B






