5, 6వ వార్డుల్లో చినబాబు విస్తృత ప్రచారం మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కూటమి చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) 5, 6వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కూటమి అభ్యర్థులతో కలిసి వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చామంచుల మల్లిక, 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అ. సరస్వతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ అభ్యర్థులను తమ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని చినబాబు ప్రజలను కోరారు.ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమై వార్డుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Rukmini M






