48 వార్డుల అభ్యర్థులతో చైర్మన్ అభ్యర్థి శ్రీరామ కుమార్ సమీక్ష మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) 48 వార్డుల అభ్యర్థులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డుల వారీగా ఎన్నికల ప్రచారం, స్థానిక పరిస్థితులు, అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ప్రతి వార్డులో అభ్యర్థులకు అండగా ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని ఎన్నికల ప్రచారానికి అవసరమైన సహకారం అందిస్తానని శ్రీరామ కుమార్ భరోసా ఇచ్చారు.మదనపల్లె పట్టణ అభివృద్ధి లక్ష్యంగా అభ్యర్థులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 48 వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.

Rukmini M






