7, 9వ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులకు బహుజన యువసేన మద్దతు మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 7, 9వ వార్డుల్లో క్రికెట్ బ్యాట్, ఉంగరం గుర్తులపై స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు బహుజన యువసేన పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ పాల్గొన్నారు.స్థానికులు, వార్డుల పెద్దలు, సభ్యులు, బహుజన యువసేన కార్యకర్తలతో కలిసి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమంలో సహకరించారు.ఈ కార్యక్రమంలో బహుజన యువసేన సభ్యులు, స్థానిక పెద్దలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Mani Kumar. B 





