మదనపల్లెలో 13, 14వ వార్డుల్లో ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఇంటింటి ప్రచార మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 13, 14వ వార్డుల్లో ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కూటమి అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డుల్లోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలతో మాట్లాడారు. మదనపల్లె పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించి, స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Mani Kumar. B






