కూటమి ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజల ఆగ్రహం... కూటమి ప్రభుత్వంలో చేనేతలకు అన్యాయం... అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం... మున్సిపల్ ఎన్నికలలో బుద్ది చెప్పడానికి సిద్ధం...
వార్డు ప్రచారంలో కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం స్పష్టంగా తెలుస్తోందని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లె మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి, వార్డు కౌన్సిలర్లు లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిందని, కూటమి ప్రభుత్వంలో నేతన్న లకు మోసం జరిగిందని చేనేతలు స్వయంగా చెబుతున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న చేనేతల పథకం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని, అర్హులైన వారికి ఇవ్వలేదని స్వయంగా లబ్ధిదారులు చెప్పడం పథకం లోని అవకతవకలకు నిదర్శనం అన్నారు. మదనపల్లె నియోజకవర్గంలో 2 వేల మంది చేనేత లకు పథకం వర్తింపజేయడం, అందులో 15 వందల మంది అనర్హులు వున్నారనే ఆరోపణలు వున్నాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ పార్టీలు, కుల, మతాలకు అతీతంగా పథకాలు అందించిన చరిత్ర వుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కేవలం టీడీపీ వారికి మాత్రమే పధకాలు వర్తింపజేయడం, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులకు అన్యాయం చేయడం జరుగుతోందని విమర్శించారు. మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్న జింకా వెంకట చలపతి అనుభవం, ప్రజాదరణ కలిగిన వ్వక్తి అని ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహమ్మద్ తోపాటు మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, చైర్మన్ అభ్యర్థి జింకా వెంకట చలపతి, శశాంక్ రెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


Mani Kumar. B






