తంబళ్లపల్లె - అక్టోబర్ 23 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ఆలయంగా చూసుకునే జనసేన పార్టీ కార్యాలయాన్ని వైకాపా గుండాలు దాడి చేసి ధ్వంసం చేయడం వారి పతనానికి నాంది అని జనసేన పార్టీ నాయకుడు మైఫోర్స్ మహేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి జరిగిన దాడిని కార్యకర్తల ద్వారా తెలుసుకొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని కొనసాగించాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యాలయం ముందే పోలీసులు 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ బఫర్ జోన్ లోని కార్యాలయం పై వైకాపా నాయకులు అరాచకం సృష్టించి అలజడి చేయాలని చూస్తే సహించేది లేదని తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జనసేన కార్యాలయం పై వైకాపా గూండాలు దాడి చేయడం పిరిగిబంద చర్య అని దమ్ముంటే ఎదుర్కోవాలని సవాలు విసిరారు. నియోజకవర్గ నాయకుడు సద్దికూటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన కార్యాలయం పై వైకాపా రౌడీలు, అరాచక శక్తులు దాడి చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. వైకాపాకు ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పిన వారిలో మార్పు రాలేదని జనసేన కార్యాలయం పై దాడికి పాల్పడిన వైకాపా రౌడీ మూకలు ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని తంబళ్లపల్లె పోలీసులతోపాటు జిల్లా ఎస్పీ, డీఐజీ కి ఫిర్యాదులు చేస్తామని మూడు రోజుల్లో వైకాపా అగంతకులను అరెస్టు చేయకపోతే కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నిరాహార దీక్ష చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎద్దుల నరసింహులు, రాజారెడ్డి, రాజశేఖర్, మురళి, మహేష్, సురేష్, టిడిపి నాయకులు పురుషోత్తం, బాలాజీ నాయుడు జనసేన ఓటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
జనసేన కార్యాలయం పై దాడి వైకాపా పతనానికి నాంది - జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 23 October 2026 08:07 PM
Srivani





