తంబళ్లపల్లె - అక్టోబర్ 23 ః తంబళ్లపల్లె ఎంపీటీసీ ఎన్నికల బరిలో ఏకంగా 40 మంది వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేసి తమ పంతం నెగ్గించుకున్నారు. వైకాపా అభ్యర్థులు గురువారం ఏడు నామినేషన్లు, శుక్రవారం ఏకంగా 33 నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై భారీ బందోబస్తు ఏర్పాటుతోపాటు కఠినమైన ఆదేశాలతో ఎస్సై అనిల్ కుమార్ సారథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు ఏకంగా 39 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైకాపా నుండి 33, టిడిపి మూడు, జనసేన మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. వైకాపాకు చెందిన అభ్యర్థులు గోపి దిన్ని ఎంపీటీసీ కి రేవతి, అశోక్ రెడ్డి, హేమావతి, నారాయణరెడ్డి పరసుతోపు ఎంపీటీసీకి రెడ్డి మల్ రెడ్డి, సురేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కుమారి. కోటకొండ ఎంపీటీసీకి అశోక్ నాయక్, కుమార్ నాయక్, రవీంద్రనాయక్, శంకర్ నాయక్. కొట్టాల ఎంపిటిసి కి వై నరసమ్మ, భూదేవి, గాయత్రి, సుగుణమ్మ. కోసవారిపల్లి ఎంపీటీసీకి శివ శంకర్ రెడ్డి, హరి కుమార్ రెడ్డి, సదాశివరెడ్డి కన్నెమడుగు ఎంపీటీసీకి కే జ్యోతి, మాధవి. బాల్ రెడ్డి గారి పల్లి ఎంపీటీసీకి నరసింహులు, శ్రీనివాసులు. ఒక రాజు పల్లి ఎంపీటీసీకి సుశీల, ఉమామహేశ్వరి, రుక్సానా, రాములమ్మ. ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీకి మహేశ్వరి, భూదేవి, హరిత, రెడ్డమ్మ. తంబళ్లపల్లె ఎంపీటీసీకి కుమారి. తెలుగుదేశం తరఫున గుండ్లపల్లి ఎంపిటిసి కి నాగేంద్ర నాయుడు, పరసతోపు ఎంపీటీసీకి డేరంగుల రెడ్డప్ప, తంబళ్లపల్లె ఎంపీటీసీకి బండ్ల పుష్పావతి. జనసేన పార్టీ తరఫున కొటాల ఎంపీటీసీకి ఎద్దుల వెంకటసుబ్బమ్మ, గోపి పిన్ని ఎంపిటిసి కి సుభాషిణి లు మొత్తం 39 నామినేషన్లు ఎన్నికల అధికారి శ్రీధర్ కు అందజేశారు. ఎన్నికల నామినేషన్ల పర్వం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో అటు ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు

తంబళ్లపల్లె ఎంపీటీసీ బరిలో 40 మంది వైకాపా అభ్యర్థులు