మున్సిపల్ ఎన్నికల్లో కూటమికే అనుకూల పవనాలు
- 44వ వార్డు కూటమి అభ్యర్థిని బండి భారతి ధీమా
- ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు వెల్లడి
మదనపల్లె : మినీ సంగ్రామాన్ని తలపిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమికే అనుకూల పవనాలు ఉన్నాయని 44వ కూటమి జనసేన అభ్యర్థిని బండి భారతి పేర్కొన్నారు.వార్డులో ఓటరు దేవుళ్ల అశీస్సులతో ఘనవిజయం సాధించి ప్రజాసేవకు వార్డు అభివృద్ధికి పునరంకితం అవుతామని ఆమె స్పష్టం చేశారు.శుక్రవారం 44వ వార్డులో కూటమి శ్రేణులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో బండి మనోహర్,టిడిపి రాష్ట్ర చేనేత విభాగం నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం,బండి కుటుంబ సభ్యులు పాల్గొని నేరుగా ఓటర్లను కలుసుకున్నారు.కూటమి పార్టీ తరఫున జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న బండి భారతిని ఆశీర్వదించి కౌన్సిల్ కు పంపాలని కోరారు.వార్డు ప్రజలకు సుపరిచితురాలుగా అందరిలో కలివిడిగా ఉండే బండి భారతి విజయం సాధిస్తే మీ ఇంటి కుటుంబ సభ్యురాలుగా ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను చూసి ఆశీర్వదించాలన్నారు.బండి మనోహర్ మాట్లాడుతూ తమ సతీమణి బండి భారతి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున వార్డు ప్రజలంతా అండగా నిలిచి ఆదరించాలని కోరారు.కూటమి విజయంతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ఇందుకు గత రెండు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి సాక్ష్యమన్నారు.రాష్ట్ర చేనేత టిడిపి నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం మాట్లాడుతూ తెలుగుదేశం,జనసేన,బిజెపి పార్టీల కూటమి ప్రభుత్వంలో మదనపల్లె సమగ్ర అభివృద్ధి జరుగుతోందని,కావున మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించి కౌన్సిల్ కు పంపితే మరింత వేగంగా అభివృద్ధి సాధ్యమన్నారు.44వ వార్డులో బండి భారతిని,మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భోజనపు ద్వారకనాథ్,గౌనిపల్లి భాస్కర్,చిన్ని అమర,చిన్ని జనార్ధన్,కూటమి పార్టీ కార్యకర్తలు స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూటమికే అనుకూల పవనాలు - కౌన్సిలర్ అభ్యర్థిని బండి భారతి