34వ వార్డులో జోరుగా సాగుతున్న తెలుగుదేశం ప్రచారం
- రంగస్వామి నాయుడుకి మద్దతుగా తరలివచ్చిన కూటమి శ్రేణులు
మదనపల్లె : మదనపల్లి మున్సిపల్ 34వ వార్డు కూటమి అభ్యర్థి బోయపాటి రంగస్వామి నాయుడు ఆధ్వర్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం వార్డులోని ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుతోపాటు తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రంగస్వామి నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి పాలన ఊపిరి పోసిందన్నారు.రాష్ట్రానికి పెట్టుబడులు,కొత్త పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు.శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో 48 వార్డుల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన విజ్ఞప్తి చేశారు.అనంతరం టిడిపి నాయకులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ గతంలో కౌన్సిలరుగా వార్డు అభివృద్ధికి రంగస్వామి నాయుడు చేసిన కృషి అమోఘమని కొనియాడారు.ఆయనకు అధిష్టానం మరోసారి అవకాశం కల్పించడం శుభ పరిణామమన్నారు.ఆయనను గెలిపించుకుంటే వార్డును అభివృద్ధి చేయడంతోపాటు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కావున నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డు అభ్యర్థిగా రంగస్వామి నాయుడు,ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబును గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మదనపల్లి ముఖచిత్రం మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు సతీమణి మాజీ కౌన్సిలర్ రెడ్డెమ్మ,తనయుడు లోకేష్ నాయుడు,కోడలు శిరీషా,శేఖర్,పెద్దఎత్తున కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Mani Kumar. B






