మదనపల్లె అభివృద్ధికై కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

- మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ విజ్ఞప్తి

- పట్టణంలో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

మదనపల్లె : విజ్ఞులైన మదనపల్లె పట్టణ ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి సుపరిపాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ ప్రకటించారు.శుక్రవారం మదనపల్లె పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణ ప్రజలకు సేవలు అందించడం కోసమే డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు.ఉన్నత విద్యావంతుడిగా,వైద్యుడుగా స్థిరపడ్డ తాను ప్రజలహితం కోరుతూ జన్మనిచ్చిన గడ్డకు సేవలందించేందుకే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు తెలిపారు.తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా గెలిపిస్తే నిజాయితీతో కూడిన,అవినీతి రహిత పాలనతో అభివృద్ధిని ప్రజలకు అంకితం చేస్తామన్నారు.తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని,పట్టణ అభివృద్ధి,ప్రజల సంక్షేమం,సమస్యల పరిష్కారం,మౌలిక సదుపాయాల కల్పన,తమ ఎజెండాగా ప్రకటించారు.అధికార ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధికి చిరునామాగా మదనపల్లెను మార్చి చూపిస్తామన్నారు.ఇప్పటి వరకు అధికారంలో ఉన్న అధికార,ప్రతిపక్ష పార్టీలు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విజయం సాధించలేక పోయాయని గుర్తుచేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే బాషా మాట్లాడుతూ మదనపల్లెలో ఉన్నత విద్యావంతుడుగా కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మనుగా పోటీ చేస్తున్న డాక్టర్ అప్సర్ షరీఫ్ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడానికి పోటీచేయడం జరిగిందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుకు ఓటు వేసి అప్సర్ షరీఫ్ ను గెలిపిస్తే ప్రజలకు సుపరిపాలనతోపాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.కావున ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముబారక్ ఖాన్,ఖాదర్ బాషా,అధిక సంఖ్యలో కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.