వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తా
- 48వ వార్డు కూటమి అభ్యర్థి కె.వి.నాగరాజు స్పష్టం
మదనపల్లె : వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని 48వ వార్డు కూటమి అభ్యర్థి కొరముట్ల నాగరాజు (కె.వి.నాగరాజు) పేర్కొన్నారు.శుక్రవారం వార్డు పరిధిలో టిడిపి శ్రేణులతో కలిసి ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారానికి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు సోదరుడు యోగేశ్వర బాబు (పెదబాబు),బొమ్మిశెట్టి పురుషోత్తం,ఉప్పు రామచంద్ర,బొమ్మిశెట్టి కృష్ణమూర్తి,ప్రభాకర్,లోకేష్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందన్నారు.గత వైసిపి పాలనతో ఒరిగింది శూన్యమన్నారు.వారి అరాచకాలు,దౌర్జన్యాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ అనుభవంతో ఏపీని గాడిలో పెడుతున్నారన్నారు.అనంత్రరం కౌన్సిలర్ అభ్యర్థి కె.వి నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని,కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలతో కల్పించడం జరిగిందన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో 48వ వార్డులో నన్ను,చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబును అఖండ మెజార్టీతో గెలిపిస్తే వార్డుల అభివృద్ధితోపాటు చేనేత రంగ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

Mani Kumar. B






