మదనపల్లెలో పర్యటించిన కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్
- జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రం సందర్శన
మదనపల్లె : జెడ్పీటీసీ నామినేషన్ల ఆఖరి రోజైన మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.కేంద్రం వద్ద విధుల్లో ఉన్న అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి,సీఐలు,ఎస్ఐలకు పటిష్ట బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు.ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ,అనుమతి ఉన్నవారినే లోపలికి పంపాలని,సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.నామినేషన్ కేంద్రాల వద్ద గాని,ఎన్నికల సమయంలో గానీ ఎవరైనా గొడవలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.
Mani Kumar. B






