కూటమిని ఆదరించండి మదనపల్లికి మహర్ధశ తీసుకొస్తాం

- ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) వెల్లడి

- 2,3 వార్డులలో అభ్యర్థులతో కలిసి ప్రచారం

మదనపల్లి : మునిసిఫల్ ఎన్నికల్లో కూటమిని ఆదరిస్తే మదనపల్లి పట్టణానికి మహర్ధశను తీసుకొస్తామని ఛైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) స్పష్టం చేశారు.శుక్రవారం 2వ వార్డు అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి,3వ వార్డు అభ్యర్థిని రాగినేని కవితలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చురుకుతనం రాష్ట్రాన్ని ముందువరుసలో నిలుపుతున్నాయన్నారు.ఇక మదనపల్లి విషయానికి వస్తే దశాబ్దాల కల అయినటువంటి జిల్లాను ఇవ్వడంతోపాటు రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయడం ఓ వరమన్నారు.ప్రజలు,మేధావులు ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.అనంతరం 2వ వార్డు అభ్యర్థిని మల్లీశ్వరి,3వ వార్డు అభ్యర్థిని కవితలు మాట్లాడుతూ ప్రజలు మాకు ఒక అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యే షాజహాన్ బాషా,శ్రీరామ్ చినబాబు సహకారంతో వార్డుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ ఇడగొట్టి రెడ్డి శేఖర్ (డ్యాన్స్ రెడ్డి),రాగినేని రఘుపతి నాయుడు,యర్రబల్లి వెంకటరమణా రెడ్డి,ముదిమడుగు రామూర్తి,ఓర్సు వీరభాస్కర్,పెద్దసంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు.