ముష్టూరు ఎంపీటీసీ బరిలో మాలతి
- జనసేన పార్టీ తరపున నామినేషన్ దాఖలు
మదనపల్లె : మదనపల్లి నియోజకవర్గం,నిమ్మనపల్లె మండలం,ముష్టూరు పంచాయతీ ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థినిగా మాలతి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా మాలతి,రమేష్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో,అభిమానంతో ఆశీస్సులు అందిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆశీస్సులతో మష్టూరు ఎంపిటిసిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా తనకు ఎంపిపిగా అవకాశం కల్పిస్తే ముష్టూరు పంచాయతీతో పాటు మండలాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని,ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మాలతి రమేష్ వెల్లడించారు.ఈ కార్యక్రమానికి జనసేన మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్,తెదేపా సీనియర్ నాయకుడు ఆర్.జె వెంకటేష్,మాజీ వైఎస్ ఎంపిపి రమణ,మాజీ సర్పంచులు,చల్లావారిపల్లి,ముష్టూరు గ్రామ ప్రజలు,మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొన్నారు.

Mani Kumar. B






