మదనపల్లి - అక్టోబర్ 23 : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె లోని జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, వాహనాలను నాశనం చేయడం, పార్టీ శ్రేణులపై దాడులకు మరియు టీడీపీ వారిపై దాడి ముళ్ళ కర్రలు ఇనప ములుకులుతో ఉన్న కట్లతో కొట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే వైసీపీ వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ దుశ్చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం.
వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటున్న మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం
Mani Kumar. B






