తంబళ్లపల్లె - అక్టోబర్ 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో అధికారం లేకపోయినా వైకాపా తన అరాచక నైజాన్ని ప్రదర్శిస్తాందని వీరి దౌర్జన్యాలకు కాలం చెల్లిందని ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని తంబళ్లపల్లి జనసేన ఇన్చార్జ్ పోతుల సాయినాథ్ విమర్శించారు. గురువారం తంబళ్లపల్లిలో వైకాపా నాయకులు జనసేన పార్టీ కార్యాలయం ధ్వంసం తోబాటు టిడిపి నాయకుల ట్రాక్టర్, ద్విచక్ర వాహనం, వస్తు సామాగ్రి ధ్వంసం చేసిన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తన పైశాచిక ప్రవృత్తిని కొనసాగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అధికారం ఉన్న ప్రజాస్వామ్య బద్ధంగా కూటమి వ్యవహరిస్తోందని తమకు ప్రజాబలం లేక ఉనికి చాటుకోవడానికి వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాంబులు, రాళ్లు, కర్రలతో దాడులు చేయడం ద్వారా ప్రజాస్వామ్యం చేస్తున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పించి తరిమికొడతారని తెలిపారు. భవిష్యత్తులో కూటమి నాయకులపై దౌర్జన్యాలకు దిగితే సహించేది లేదని ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అరాచక వైకాపా కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు - జనసేన ఇంచార్జ్ సాయినాథ్