తంబళ్లపల్లె - అక్టోబర్ 22 : తంబళ్లపల్లె మండల ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా గురువారం మొత్తం 14 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీధర్ తెలిపారు. ఇందులో వైకాపా 7, జనసేన మూడు, బిజెపి 2, టిడిపి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా తరపునకన్నెమడుగు ఎంపీటీసీ స్థానానికి లీలావతి, జ్యోతి గోపి దీన్ని ఎంపీటీసీ స్థానానికి భాస్కర్ రెడ్డి, గుండ్లపల్లి ఎంపీటీసీ స్థానానికి జనార్దన్, భాస్కర్, తంబళ్లపల్లె ఎంపీటీసీ స్థానానికి అంజనమ్మ, పరసుతోపు ఎంపీటీసీ స్థానానికి మధుకర్ లు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన కొట్టాల ఎంపిటిసి అభ్యర్థిగా వెంకటసుబ్బమ్మ, బాల్ రెడ్డి గారి పల్లె టిడిపి అభ్యర్థిగా వెంకటరమణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆంజనేయులు, కోటకొండ బిజెపి అభ్యర్థిగా నాగేంద్ర నాయక్, జనసేన పరుసుతోపు ఎంపీటీసీ అభ్యర్థిగా రాజారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.