తంబళ్లపల్లె అక్టోబర్ 21 : తంబళ్లపల్లె మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ములకలచెరువు సిఐ దస్తగిరి ఆదేశాల మేరకు ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం తంబళ్లపల్లె మదనపల్లె ప్రధాన రహదారిలో శ్రీదివ్య ఆసుపత్రి, పెద్దమండెం రహదారి వైయస్సార్ సర్కిల్ వరకు 500 మీటర్ల పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటుచేసి పోలీస్ పికేటింగ్ తోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలోకి నామినేషన్ల అభ్యర్థులను క్యూ పద్ధతిలో లోపలికి పంపి నామినేషన్ల వేయడానికి సహకరించారు. మొదటి రోజున నామినేషన్ల కార్యక్రమం సాఫీగా జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు హర్షం వ్యక్తం చేశారు
తంబళ్లపల్లె ఎంపీటీసీ ఎన్నికలకు పోలీసుల భారీ భద్రత
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 22 October 2026 09:11 AM
Srivani





