తంబళ్లపల్లె - అక్టోబర్ 21: తంబళ్లపల్లె మండలంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘనవిజయం తప్పదని బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పీట్ల అంజలి రాజనాల, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డిలు ధీమాగా చెప్పారు. బుధవారం తంబళ్లపల్లె మండల కేంద్రంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెడుతోందని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. నేడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అవినీతి వైకాపాను ఓడించి మండలాన్ని క్లీన్ స్లీప్ చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దేరు చైర్మన్ కొటాల శివకుమార్, క్లస్టర్ ఇన్చార్జి లు బేరి శ్రీనివాసులు, బిఎంఆర్, కాల నారాయణ, వెంకట్ రెడ్డి, వీరాంజనేయులు, రమణ, రామచంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, సుధాకర్, సామిరెడ్డి, శేఖర్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తంబళ్లపల్లి లో కూటమిదే విజయకేతానం
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 22 October 2026 08:00 AM
Srivani





