తంబళ్లపల్లె - అక్టోబర్ 19 : తంబళ్లపల్లె మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎన్నికల పి ఓ, ఏ పీ ఓ లు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్, అసిస్టెంట్ ఎన్నికల అధికారులు తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణి లు తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆఫీసర్ల కు ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 21 నుండి 23 వరకు నామినేషన్లు, 24న పరిశీలన, 25న అప్పీలు, 26న నామినేషన్ల తిరస్కరణ, 27న ఉపసంహరణ ఉంటాయన్నారు. నవంబర్ మూడో తేదీ జరిగే ఎంపీటీసీ ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంతంగా జరగడానికి కృషి చేయాలన్నారు. నాలుగో తేదీ అవసరమైన చోట రీపోలింగ్ 5వ తేదీ ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పఠిష్ట పోలీసు బందోబస్తు కార్యాలయానికి 100 మీటర్ల అవతల చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నామినేషన్లు సమయంలో అభ్యర్థితో పాటు ఇరువురికి మాత్రమే ప్రవేశం కల్పించి క్యూ పద్ధతిని పాటిస్తున్నట్లు చెప్పారు. ఈ అవగాహన సదస్సులో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, పిఓ, ఏపీవోలు పాల్గొన్నారు
నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం - ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్.
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 19 October 2026 08:33 PM
Srivani





