తంబళ్లపల్లె అక్టోబర్ 19 : తంబళ్లపల్లె కస్తూరిబా బాలికల గురుకుల విద్యార్థినులకు స్థానిక శ్రీదివ్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో పది రోజులుగా మెడికల్ ఒకేషనల్ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు డాక్టర్ వెంకట తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు బెడ్ మేకింగ్, బయోటెక్ మేనేజ్మెంట్, ఈసీజీ, బయో మెడికల్, ల్యాబ్ సిస్టం, డ్రెస్సింగ్, ఫార్మసీ, బేసింగ్ నర్సింగ్ పై శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు వైద్య వృత్తిపై ముందస్తు అవగాహన దోహదపడుతుందని డాక్టర్ తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో శ్రీ దివ్య ఎమర్జెన్సీ హాస్పిటల్ నిర్వాహకురాలు శ్రీవిద్య, డాక్టర్ రాధ, ఉపాధ్యాయురాలు మల్లిక, సిబ్బంది పాల్గొన్నారు
విద్యార్థులకు శ్రీదివ్య ఆసుపత్రిలో వోకేషనల్ ట్రైనింగ్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 19 October 2026 08:30 PM
Srivani





