అసిస్టెంట్ ఎన్నికలు అధికారిపై దాడి
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె దొంతి వీధిలోని ఎన్నికల కార్యాలయం వద్ద టిడిపి గుండాలు ఎన్నికల అసిస్టెంట్ అధికారి బుర్రయ పై దాడి చేసి షర్టు చింపేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు మేరకు.. 10వ వార్డుకు చెందిన శ్రీరామ సహదేవనాయుడు తన వద్దకు వచ్చి, పదవ వాటిలో ఆపోజిషన్ అభ్యర్థి(యూ సుధాకర్ రెడ్డి ) నామినేషన్ చింపి వేయాలని ఒత్తిడి తేవడంతో నిరాకరించిన తనపై సహదేవ వెంట వచ్చిన రాజేష్ దాడి చేసి కొట్టి చట్టం చింపడం జరిగిందని ఆరోపించాడు తనకు జరిగిన అన్యాయంపై వెంటనే అసిస్టెంట్ ఎన్నికల అధికారి ప్రమీలకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు
Mani Kumar. B






