ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి దాతృత్వం
- వెలుగు సంస్థలో దివ్యాంగులు,వృద్ధులకు స్నాక్స్ వితరణ
మదనపల్లె : పట్టణంలోని అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు సంస్థకు ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్,వారి బృందం సోమవారం విచ్చేసి వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులను ప్రేమతో పలకరించారు.గత కొన్ని సంవత్సరాలుగా వెలుగు సంస్థ దివ్యాంగులకు,వృద్ధులకు చేస్తున్న సేవలను గుర్తించి తమవంతు సాయంగా స్నాక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫర్ ది పీపుల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆప్ ఇండియా మేనేజంగ్ డైరెక్టర్ మాట్లాడుతూ వృద్ధుల దివ్యాంగుల మమతల కోవెల వెలుగు సంస్థ అని,మదర్ థెరిస్సా ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ సేవలను అందిస్తోందని కొనియాడారు.వెలుగు సెక్రటరీ యం.ఉదయ్ మోహన్ రెడ్డి సేవలు పలువురికి ఆదర్శమన్నారు.ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.మా పౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది,వృద్దులు,దివ్యాంగులు పాల్గొన్నారు.

Rukmini M






