అట్టహాసంగా పచ్చిపాల తులసి రామకృష్ణ నామినేషన్
- నాలుగోసారి కౌన్సిలరుగా విజయమే లక్ష్యమని వెల్లడి
- హాజరైన యువనేత జునైద్ అక్బరీ,తెలుగుదేశం శ్రేణులు
మదనపల్లె : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 28వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా పచ్చిపాల తులసి రామకృష్ణ ఆదివారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.మూడుసార్లు కౌన్సిలరుగా విజయం సాధించానని,నాలుగవసారి గెలుపే ధ్యేయమని,ఈ సందర్భంగా వార్డు ప్రజల ఆశీస్సులు,ఆదరాభిమానాలు కోరుతున్నట్లు తెలిపారు.తన నామినేషన్ ప్రక్రియ పూర్తిచేయడంలో సహకరించిన టీడీపీ నాయకులు,కార్యకర్తలకు పచ్చిపాల తులసి కృతజ్ఞతలు తెలిపారు.తనకు మద్దతుగా నిలుస్తున్న వార్డు ప్రజలకు,పెద్దలకు,పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా పచ్చిపాల తులసి మాట్లాడుతూ 28 వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వార్డులో తాగునీరు,డ్రైనేజీ వ్యవస్థ,రహదారులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.ప్రజల నుంచి తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా,ప్రతి రోజూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని,ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.వార్డు అభివృద్ధి కోసం తనస్థాయికి మించి కష్టపడతానని,ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులు,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,పెద్దసంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నాయి.

Rukmini M






