నామినేషన్లు దాఖలు చేసిన జనసేన అభ్యర్థులు
మదనపల్లి : మదనపల్లె మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు.రెండో వార్డు అభ్యర్థినిగా వి.సుధా మహేశ్వరి,ఐదో వార్డు అభ్యర్థిగా చామంచుల మల్లికా సిద్ధు,ఒకటవ వార్డు అభ్యర్థిగా పి.శివ శంకర నామినేషన్లు సమర్పించారు.జనసేన పార్టీ రాయలసీమ కో-ఆర్డినేటర్ దారం అనిత అభ్యర్థులకు మద్ధతుగా నామినేషన్ సెంటరుకి విచ్చేశారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.అలాగే జనసేన పార్టీ ప్రతిష్ఠను కాపాడేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు అందించాలని ప్రజలను కోరారు.కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి జనసేన నాయకులు,కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.పార్టీ అభిమానులు కూడా ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావాలని కోరారు.వార్డుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని అభ్యర్థులు తెలిపారు.నామినేషన్ల కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నాయి.ఈ కార్యక్రమంలో ఉమ,నరేష్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.