మదనపల్లె 4వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా మావిళ్ల వెంకటేష్ నామినేషన్

ప్రజా సేవే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి.. వార్డు ప్రజల ఆశీర్వాదం కోరుతున్న వెంకీ

మదనపల్లె మున్సిపాలిటీలోని 4వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా మావిళ్ల వెంకటేష్ (వెంకీ) నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పేదలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పలు ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ, ప్రత్యక్ష సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ప్రజలకు మరింత బాధ్యతతో సేవలందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మావిళ్ల వెంకటేష్ పేర్కొన్నారు. వార్డు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

కౌన్సిలర్‌గా తనకు అవకాశం కల్పిస్తే పూర్తి సమయం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో ప్రజా సేవకు మరింత అంకితమవుతానని పేర్కొంటూ, 4వ వార్డు ప్రజలు తనకు అండగా నిలవాలని మావిళ్ల వెంకటేష్ (వెంకీ) విజ్ఞప్తి చేశారు.

మదనపల్లె 4వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా మావిళ్ల వెంకటేష్ నామినేషన్మదనపల్లె 4వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థిగా మావిళ్ల వెంకటేష్ నామినేషన్