తంబళ్లపల్లె - అక్టోబర్17 : తంబళ్లపల్లె మండలంలో ఈమధ్య కురిసిన వర్షానికి రైతులు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఉలవల సాగుకు శ్రీకారం చుట్టారు. మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఉలవలు, పలు రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో రైతులు సాగు చేపట్టారు. అదేవిధంగా మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఉలవలు సైతం రైతులు దుక్కిలు దున్ని సాగు చేస్తున్నారు