తంబళ్లపల్లె - అక్టోబర్ 17 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమిష్టిగా కృషి చేయాలని తంబళ్లపల్లె జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు జనసేన కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించి జనసైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో జనసేన పార్టీకి కేటాయించిన స్థానాల్లో కూటమి నాయకుల సహకారంతో అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. కూటమి నాయకులు పోటీ చేసిన స్థానాల్లో సైతం సమిష్టి కృషితో కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేసి కూటమి ధర్మం పాటించాలని ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు జనసేన ఇంచార్జి పోతుల సాయినాథ్ తో పాటు ఎం ఎన్ చంద్రశేఖర్ రెడ్డి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాలలో జనసేన నాయకులు ఎద్దుల నరసింహులు, కార్యకర్తలు పాల్గొన్నారు