అరాచకాలు,దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
- స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట కాంగ్రెస్ అభ్యర్థులు పోటీచేయాలి
- కాంగ్రెస్ పునర్నిర్మాణానికి అందరూ కృషి చేయాలి
- 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం
- కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం స్పష్టం
మదనపల్లె : అరాచకాలు,దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని,స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోట కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయాలని కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెడి శీలం పేర్కొన్నారు.శనివారం మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జెడి శీలం మాట్లాడుతూ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయన్నారు.ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో వైసిపి,టిడిపి శ్రేణులు పరస్పర దాడులు చేసుకోవడం,నామినేషన్ల సజావుగా సాగకపోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదని టిడిపి,మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నాయన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట పోటీ చేయాలని ఇందుకు నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు చొరవ చూపాలన్నారు.కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటామని చెబుతున్నారని,అది ఎవరితరం కాదన్నారు.పేదల సంక్షేమం,దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నినాదం అన్నారు.కాంగ్రెస్ పునర్నిర్మాణంలో పార్టీఅన్ని విభాగాలు కీలకపాత్ర పోషించాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రం,దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలంతా గమనిస్తున్నారని 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం,రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అనంతరం స్థానిక సంస్థల జిల్లా ఇంచార్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలనన్నదే కాంగ్రెస్ పార్టీ అభిమతమన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వంలో జరుగుతున్న గొడవలు ప్రజాస్వామ్యానికి చేటు తీసుకొస్తాయన్నారు.జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కండువాలు ధరించి నామినేషన్లు వేయాలని ఆయన సూచించారు.ప్రస్తుతం రాష్ట్రంలో,దేశంలో కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమన్నారు.ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్,జిల్లా ఉపాధ్యక్షులు కొండుపల్లి ఆనంద్,నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు మురళీమోహన్ యాదవ్,సోమశేఖర్ రెడ్డి,కలిచెర్ల మస్తాన్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణారెడ్డి,సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్,మైనార్టీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే.బాషా,అప్సర్ షరీఫ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సమీరుద్దీన్,హిదాయతుల్లా,మీనాకుమారి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అరాచకాలు,దౌర్జన్యాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు - స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట కాంగ్రెస్ అభ్యర్థులు పోటీచేయాలి