ఇరువురు అంతర జిల్లాల దొంగలు అరెస్ట్
- అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి
మదనపల్లె : అన్నమయ్య,కడప జిల్లాల్లో 9 చోరీలకు పాల్పడిన దొంగలు (ఇరగ అశోక్,గువ్వ ఆనంద్ బాబు) అరెస్ట్ చేసి వారి నుండి 185 గ్రాముల బంగారం,450 గ్రాముల వెండి,ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు.బుధవారం మదనపల్లెలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి పర్యవేక్షణలో నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ కె.రాజారెడ్డి,ఎస్ఐలు నరసింహుడు,రమేష్,హరిహర ప్రసాద్,రహీముల్లాను ఎస్పీ అభినందిస్తూ నగదు రివార్డులు అందజేశారు.మదనపల్లె డిఎస్పీ బి.ప్రసాద్ పాల్గొన్నారు.ప్రజలు ఊరెళ్లేటప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని,అనుమానితులు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలను ఎస్పీ సూచించారు.ప్రజల సహకారంతో పూర్తిస్థాయిలో నివారించవచ్చునన్నారు.యువత చెడువ్యసానాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని సూచించారు.

Mani Kumar. B






