శ్రీమహమ్మారమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు
- వెన్నెతో అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం
మదనపల్లె : మదనపల్లి పట్టణం ఎస్బిఐ కాలనీ నందు వెలసిన శ్రీమహమ్మారమ్మ తల్లి దేవస్థానం నందు శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా బుధవారం వెన్నెతో అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వాతావరణలో వేడుకలు జరుగుతున్నాయి.అమ్మవారికి పంచామృతా భిషేకం,తీర్థప్రసాద వినియోగము,లలిత సహస్రనామ కుంకుమార్చన,ప్రాకారోత్సవం,అమ్మవారికి దశ విదహారతులు,మహా మంగళ హారతి నిర్వహించారు.ఇందులో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొమ్మాడి రామకృష్ణారెడ్డి,గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,నాదెళ్ళ వెంకటేశ్వర ప్రసాద్ (శివన్న),డి.ద్వారకనాథ రెడ్డి,వైస్ చైర్మన్ 
కొండుపల్లి ప్రసాద్ బాబు,సెక్రటరీ గంగాసాని మస్తాన్ రెడ్డి,ట్రెజరర్ పి.వి.శ్రీనివాసరామమూర్తి (భవాని శ్రీను) జాయింట్ సెక్రటరీ ఎస్.మాధవ రెడ్డి 
కో-ట్రెజరర్ బిఎం.వెంకటరమణ,ఆలయ ట్రస్టీలు బి.వెంకటేశ్వర రెడ్డి,శ్రీరామ సహదేవ నాయుడు,మారువేణి వెంకట్రాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా దసరా శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతొందని తెలిపారు.కావున పుర ప్రజలు,అమ్మవారి భక్తులు నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపాకటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ కాలనీ ప్రజలు,ప్రముఖులు,అమ్మ వారి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీమహమ్మారమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు - వెన్నెతో అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం