మదనపల్లె మున్సిపల్ ఛైర్ పర్సన్ రేసులో బోడిపాటి మమత
- మంత్రి నారా లోకేష్ బాబుని కలసిన బోడిపాటి శ్రీనివాస్ దంపతులు
మదనపల్లె : మంత్రి నారా లోకేష్ బాబును విజయవాడలో బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం,మదనపల్లి పట్టణానికి బోడిపాటి శ్రీనివాస్,మమత దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.మదనపల్లె మునిసిఫల్ ఛైర్మన్ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ జరుగుతున్న వేళ వీరు మంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.గత కొన్ని దశాబ్దాలుగా బోడిపాటి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి నిర్విరామ కృషిచేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబు,పార్టీ ప్రముఖులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారు.వారు పార్టీకి చేసిన సేవలకు మదనపల్లె మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ పదవి బోడిపాటి మమతకు కేటాయిస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తోంది.ఇప్పటికే మదనపల్లె పట్టణ కూటమి నాయకులు,కార్యకర్తలను ఐవిఆర్ఎస్ కాల్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికే ప్రాధాన్యతనిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి విధితమే.మదనపల్లె మునిసిపల్ ఛైర్మన్ పదవిపై కూటమి నుండి పలువురు ఆసక్తి చూపుతున్న తరుణంలో ఎవరికీ కేటాయిస్తారోనని ప్రజలు,రాజకీయ విశ్లేషకులు వేచిచూస్తున్నారు.
మదనపల్లె మున్సిపల్ ఛైర్ పర్సన్ రేసులో బోడిపాటి మమత - మంత్రి నారా లోకేష్ బాబుని కలసిన బోడిపాటి శ్రీనివాస్ దంపతులు
మదనపల్లె మున్సిపల్ ఛైర్ పర్సన్ రేసులో బోడిపాటి మమత - మంత్రి నారా లోకేష్ బాబుని కలసిన బోడిపాటి శ్రీనివాస్ దంపతులు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 14 October 2026 07:05 PM
Mani Kumar. B 





