శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనకు హాజరుకండి
- తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుకి ఆహ్వానం
మదనపల్లె : అన్నమయ్య జిల్లా,మదనపల్లె నియోజకవర్గం,సీటీఎం క్రాస్ రోడ్డు సమీపంలోని దయ్యాలవారిపల్లిలో అక్టోబర్ 17వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మంగళవారం ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని గ్రామస్తులు ఆహ్వానించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ గ్రామాలలో ఆలయాల నిర్మాణం,ఆలయాల మరమ్మతులతో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతోందన్నారు.దయ్యాలవారిపల్లెలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం శుభసూచకమన్నారు.ఈ బృహత్తర కార్యక్రమానికి తప్పక హాజరవుతానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గోపాల్ రెడ్డి,నాగార్జున రెడ్డి,దినకర్,వెంకటరమణ,నారాయణ,సురేష్,రఘునాథ్ రెడ్డి,సుబ్బారెడ్డి,కృష్ణ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,చలపతి,గిరినాథ్ రెడ్డి మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు.