విద్యా,రాజకీయ రంగాలల్లో డాక్టర్ ఎన్.సేతు ప్రత్యేక ముద్ర
- ఘనంగా సన్మానించిన మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు
మదనపల్లె : విద్యా వ్యవస్థకు వెలుగు,విద్యార్థులకు మార్గదర్శి,సమాజ హితం కోసం పరితపించే వ్యక్తి విజయభారతి విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు నల్లుస్వామి అని మదనపల్లె ప్రెస్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.మంగళవారం పట్టణంలోని విజయభారతి పాఠశాల ప్రాంగణంలో డాక్టర్.సేతు నల్లుస్వామి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నక్కింటి రవీంద్ర,సెక్రటరీ మోడెం శ్రీనివాసరావు,10 టివి రిపోర్టర్ లక్ష్మీపతి,ఎన్95 మణి,ఆంధ్రనాడు హరి,రన్ టీవీ రిపోర్టర్స్ వెంకటేష్,రఫీ తదితరులు హాజరై సేతును భారీ పూలమాల వేసి,శాలువాతో సత్కరించి,పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ భారతి పాఠశాలను స్థాపించి మూడు దశాబ్దాలకుపైగా లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి,వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని కొనియాడారు.ప్రతి ఏడాది పదవ తరగతి ఫలితాల్లో విజయభారతి విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు.రాజకీయాలలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారని,బీజెపిలో అంచలంచెలుగా ఎదిగి,ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి హోదాలో కొనసాగుతున్నారన్నారు.నిరంతరం విద్యార్థుల వికాసం,ప్రజాశ్రేయస్సుకై పరితపించే డాక్టర్ సేతు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.