యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి
- క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన టిడిపి నేత సుకుమార్ బాబు
మదనపల్లె : యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని,తమకు ఇష్టమైన క్రీడలలో సత్తా చాటాలని విశ్రాంత డీఎస్పీ,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుకుమార్‌బాబు పేర్కొన్నారు.పట్టణానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు మంగళవారం సుమారు రూ.20 వేల విలువైన క్రికెట్ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా విశ్రాంత డి.ఎస్.పి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.క్రీడలతో శారీరక దృఢత్వం,మానసిక ఉల్లాసం కలుగుతాయని తెలిపారు.గతంలోనూ క్రికెట్,వాలీబాల్,షటిల్ తదితర క్రీడాసామగ్రిని 50కిపైగా టీములకు అందించినట్లు ఆయన తెలిపారు.క్రీడా కిట్లు అవసరమైన యువకులు తనను సంప్రదిస్తే వారికి కిట్లను అందజేస్తానని,త్వరలో వాలీబాల్,కబడ్డీ,క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన క్రీడాకారులు గిరీష్,సాయి,ఈశ్వర్,పురుషోత్తం,నవీన్,వెంకటేష్,రెడ్డి,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి - క్రికెట్ కిట్లను పంపిణీ చేసిన టిడిపి నేత సుకుమార్ బాబు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 13 October 2026 07:58 PM
Mani Kumar. B 





